శ్రీరంగాపూర్: శ్రీరంగాపురం మండలంలో మద్యం పట్టివేత ఈశ్వరయ్య పై కేసు నమోదు
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు నిర్వహించిన దాడులలో 10 లీటర్ల మద్యం పట్టుబడిందని ఎస్ఐ వెంకటీశ్వర్లు తెలిపారు తాటిపాముల గ్రామానికి చెందిన ఈశ్వరయ్య తన ఇంటిలో మద్యం విక్రయిస్తున్నాడు అన్న సమాచారంతో సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడులలో మద్యం పట్టుబడిందని, పంచనామ నిర్వహించి ఈశ్వరయ్య పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.