ప్రొద్దుటూరు: ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ఆటో బోల్తా.. రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు
Proddatur, YSR | Oct 29, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మైదుకూరు - ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు గుంతలతో అధ్వానంగా మారాయి. సినీహబ్ సమీపంలో రోడ్డు దారుణంగా తయారైంది. ఇక్కడ రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.