యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలం తుమ్మడ పల్లె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసిపి నాయకులు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం తుమ్మడపల్లి గ్రామంలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల కలుగు నష్టాలను ప్రజలకు వివరిస్తూ వైసిపి నాయకులు కరపత్రాలు పంచారు. సంతకాల సేకరించి గవర్నర్ ని కలిసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడ్డుకుంటామని వైసిపి నాయకులు తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం వల్ల పేదలు విద్యా వైద్యాన్ని కోల్పోతారని వైసిపి నాయకులు అన్నారు.