మార్కాపురం: క్రికెట్ అభిమానుల కోసం భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ నందు ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ని తిలకించేందుకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అభిమానులతో సందడి వాతావరణం నెలకొన్నది. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆ దిశగా అందరు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.