ఉదయగిరి: కానీయంపాడు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న పిల్లపేరు వాగు రాకపోకలను నిలిపివేసిన అధికారులు
వరికుంటపాడు మండలం, కనియంపాడులో వద్ద పిల్లపేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కనియంపాడు, రామదేవులపాడు గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రజలు వాగును దాటే ప్రయత్నం చేయరాదని MRO హేమంత్ కుమార్, SI రఘునాథ్ తెలిపారు.