ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకారం శ్రీకాళహస్తిశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులుగా టీడీపీ నాయకులు గోపి, లక్ష్మమ్మ, గుర్రప్పశెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నర్సింహయాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని MLA సూచించారు.