ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గురువారం బిజెపి నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షుడు సగం శ్రీనివాసులు హాజరయ్యారు. నియోజకవర్గం లో మండల కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీనివాసులు బిజెపి నాయకులకు తెలిపారు. అలానే ప్రధానమంత్రి ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీనివాసులు నాయకులకు తెలిపారు.