గాజువాక: ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు సన్యాసిరావుకి నివాళులు అర్పించిన గాజువాక సిపిఎం నేతలు
ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు రచయిత కామ్రేడ్ జి సన్యాసిరావు ప్రథమ వర్ధంతి సభను గాజువాక లైన్స్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా సిపిఎం సభ్యులు జగ్గు నాయుడు, గాజువాక సిపిఎం జోన్ కమిటీ సభ్యులు రాంబాబు హాజరయ్యి కామ్రేడ్స్ సన్యాసిరావు చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. జగ్గు నాయుడు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల్లో ఉద్యమ నేతలకు తన పాట ద్వారా మేల్కొల్పి ఉద్యమాన్ని మరింత తీవ్రతను చేసి ఆ ఉద్యమం విజయం సాధించేటట్లు పాట ద్వారానే చేసిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్స్ సన్యాసిరావు అని చనిపోయిన తర్వాత కూడా ఆయన పార్దేవదేహాన్ని కేజీహెచ్‌కు అప్పగించారు.