మహిపాల చెరువు సెంటర్ లో రోడ్డు ప్రమాదం, ఆటో బైక్ ను ఢీకొన్న ఘటనలో తండ్రి కొడుకులకు గాయాలు
216 జాతీయ రహదారిపై మహిపాల చెరువు సెంటర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం టాటా ఏసీ వాహనం బైక్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనలో ముమ్మిడివరం టి టి ఆర్ నగర్ కు చెందిన తండ్రీ కొడుకులు గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.