తాడిపత్రి: ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొనేలా చూడాలని పిలుపునిచ్చిన తాడిపత్రి ఎమ్మార్పీఎస్ నేతలు
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామంలో దండోరా జెండా ఘనంగా ఎగిరి వేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాడిపత్రి మండలం చిన్న పడమల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నేతలు గ్రామంలో సమావేశం అయ్యారు. జూలై 7న 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని తెలిపారు అంతేకాకుండా చదువుకున్న యువకులు గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొనేలా చూడాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నేతలు పెద్దిరాజు సిబి రవి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.