అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండల కేంద్రంలో రబ్బరు తోటలు సాగు చేసే గిరిజన రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు ఐటిడీఏ పీవో కట్ట సింహాచలం తెలిపారు. మారేడుమిల్లి ప్రాంతంలో గిరిజన రైతులు రబ్బరు సాగుకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని, వారందరికీ ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో రబ్బరు పంట మరింత అభివృద్ధి సాధించాలని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పిఓ చెప్పారు. గిరిజన రైతులు ఈ సాగు పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.