గద్వాల్: సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న 61 మంది బాధితులకు 17,26,363/- రూపాయాల రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేత..
గద్వాల సైబర్ క్రైమ్ కు గురై 69,06,133 రూపాయల పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా రిఫండ్ ఆర్డర్ కాపీలను అందజేసారు. ఇందులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అథారిటి కోర్ట్ ద్వారా 22 మందికి, జె.ఎఫ్.సి.ఎం. ఆలంపూర్, ప్రిన్సిపల్ జె.ఎఫ్.సి.ఎం. గద్వాల్, అదనపు జె.ఎఫ్.సి.ఎం. గద్వాల్ కోర్టులలో 39 మందికి రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశారు.సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 కు లేదా సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సూచించారు.