బ్రాహ్మణపల్లి తండాలు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, అవస్థలు పడుతున్న ప్రజలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి తండాలో 2 రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆదివారం తెలిపారు. విద్యుత్ సిబ్బంది శనివారం ఉదయం ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఇండ్లలోని లైట్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, టీవీలు కాలిపోతున్నాయన్నారు. రాత్రి విద్యుత్ లేకపోవడంతో ఇండ్లలో దోమలు అధికమయ్యా యన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు.