అదిలాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతకాన్ని ఎగురావేశారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ నగేష్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్,అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని అన్నారు