జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటమే ఏపీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యమని రాష్ట్ర కార్యదర్శి బి.మద్దిలేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గోరంట్లప్ప తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించడం, జర్నలిస్టులపై కేసులు పెట్టడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామ