కార్మిక కర్షక రైతు సంఘాల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీంబాషా పిలుపునిచ్చారు. శనివారం కోవేలకుంట్లలోని కామ్రేడ్ కొండారెడ్డి స్మారక గ్రంథాలయంలో ఈనెల 9న జరిగే కార్మిక, కర్షక, రైతు సంఘాల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె కరపత్రం విడుదల చేశారు. కార్మికులకు సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.