గుంతకల్లు: పట్టణంలోని ప్రతి వార్డుకు తాగునీరు సరఫరా, గుంతకల్లు మునిసిపల్ చైర్ పర్సన్ భవాని, కమిషనర్ నయీం అహ్మద్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అన్ని మునిసిపల్ వార్డులలో కొళాయిల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తామని గుంతకల్లు మునిసిపల్ చైర్ పర్సన్ భవాని, కమిషనర్ నయీం అహ్మద్, ఎమ్మెల్యే సోదరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న గౌతమి నగర్, బాలుర ఉన్నత పాఠశాల ప్రాంతాలలో నూతనంగా నిర్మించిన రెండు ఈఎల్ఎస్ఆర్ నీటి ట్యాంకులను మంగళవారం వారు ప్రారంభించారు.