పీలేరు శ్రీభువన విద్యాలయంలో ఘనంగా అష్టావధాన మహోత్సవం కార్యక్రమం
పీలేరు మండలం పీలేరు పట్టణంలోని చిత్తూరు మార్గంలో గల శ్రీభువన విద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీభువన విద్యా సంస్థల సౌజన్యంతో చిత్తూరు హరివిల్లు లలితకళావేదిక ఆధ్వర్యంలో అష్టావధాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ గోరంట్ల ఉమారమాదేవి అధ్యక్షత వహించారు. వి.కోటకు చెందిన అవధానద్యుతి మల్లెల నాగరాజు తమ అద్భుతమైన పాండిత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఎస్.వి యూనివర్సిటీ పూర్వ పాలకమండలి సభ్యులు,కళారత్న డా. వేంపల్లి అబ్దుల్ ఖాదర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయించారు.