సంగారెడ్డి: వృద్ధులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తాం:సంగారెడ్డిలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డిలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ, వృద్ధులకు ప్రభుత్వం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నామని, వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. వృద్ధులకు ప్రభుత్వం కొన్ని హక్కులు కల్పించిందని ఆమె చెప్పారు.