నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే మహోత్సవాలకు హాజర కావాలని ఆలయ ఈవో పాండురంగారెడ్డి, బనగానపల్లి మాజీ సర్పంచు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజా రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవ గోడపత్రాలను వారు విడుదల చేశారు. కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, మౌలిక సదుపాయాలు కల్పించాలని బీసీ రాజా రెడ్డి సూచించారు.