అమీర్పేట: ఖైరతాబాద్ లో తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన మాజీ సర్పంచులు
ఖైరతాబాద్ లోని పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు మంగళవారం మధ్యాహ్నం మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయట్లేదని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోవట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని రోడ్డుపై పడుతున్నామని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. ప్రభుత్వం పట్టించుకోవాలని తెలిపారు.