పెద్దమందడి: స్నేహ చికెన్ పరిశ్రమ దుర్మార్గాలపై విచారణ జరపాలి
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామం, స్నేహ చికెన్ పరిశ్రమ దుర్మార్గాలపై విచారణ జరపాలి అని వెల్టూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు మీడియా సమావేశం నిర్వహించిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ...భూ కబ్జాలు, జల దోపిడీతో దౌర్జన్యం చేస్తూ... వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు