దొనకొండలో ఏర్పాటు చేస్తామన్న పారిశ్రామిక వాడ ఏమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఈశ్వరయ్య విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి 20 లక్షల కోట్లు వచ్చాయని ఒకరికి ఒకరు పొగుడుకోవడమే తప్ప పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదని ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దొనకొండ పారిశ్రామిక వాడగా ప్రకటించి ఇంతవరకు ఎందుకు ఆ విధంగా అడుగులు వేయలేదని నిలదీశారు.