శామీర్‌పేట: మేడ్చల్ ఐటిఐ కళాశాల వద్ద బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న లారీ, మహిళ మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ ఐటిఐ కళాశాల వద్ద సోమవారం బైక్ పై వెళ్తున్న దంపతులను కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పై కూర్చున్న 35 ఏళ్ల కళావతి తలపై నుండి లారీ దూసుకెల్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.