అసిఫాబాద్: ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన తెలిపిన ఆశ్రమ పాఠశాల హాస్టల్ కార్మికులు
గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. Citu జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమ చారి మాట్లాడుతూ...గత 5 రోజులుగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టిన కూడా జిల్లా అధికారులు స్పందించడం లేదన్నారు. హాస్టల్ కార్మికుల ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.