హిమాయత్ నగర్: కంటోన్మెంట్లో కాంగ్రెస్ను గెలిపించినట్లు జూబ్లీహిల్స్ లో రిపీట్ అయ్యేలా చూడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
బోరబండ లో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించింది అని తెలిపారు. అబద్ధాల మీద కోటలు కట్టారని విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ను గెలిపించినట్లు జూబ్లీహిల్స్ లో కూడా రిపీట్ అవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.