తెలుగోళ్ల ఆశా కిరణం మంత్రి లోకేష్ : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
తెలుగోళ్ల ఆశా కిరణం మంత్రి లోకేష్ : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. తెలుగోళ్ల ఆశా కిరణం మంత్రి లోకేష్ అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నేపాల్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగువారిని సురక్షితంగా తీసుకుచ్చారాని అయన కొనియాడారు. ఇతర రాష్టాల ముఖ్యమంత్రుల కంటే వేగంగా స్పందించి.. ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. నెల్లూరు NTR భవన్ లో బాధితులతో కలిసి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కు చెందిన ఎనిమిది మందిని జిల్లాకి సురక్షితంగా పంపడంలో మంత్రి లోకేష్ కృషి అభినందనీయమని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకాయన మీడియాకు తెలిపారు.