గుడివాడ: మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం
మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన గుడివాడ పట్టణంలోని ఆరు ఏడు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు.