గడువులోపు రీసర్వే పనులు పూర్తి చేయండి : కమిషనర్
నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న రీ సర్వే పనులు గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారుల ఆదేశించారు బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూములు రిసర్వే పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నక్ష కార్యక్రమాన్ని అధికారులు సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిచేయాలని అధికారుల ఆదేశించారు స్థానికంగా ఉన్న నాయకులను ప్రజలను కలుపుకొని పారదర్శకంగా సర్వే చేయాలని తెలిపారు. ముందుగా ప్రభుత్వ భూములను సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించారు