అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం బి యాలేరు గ్రామంలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బి యాలేరు గ్రామానికి చెందిన శివయ్య అనే వ్యక్తి స్థానిక పాఠశాల వద్ద ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.