దేవరకొండ: జంగాల కాలనీలో కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త
నల్లగొండ జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి దేవరకొండలోని జంగాల కాలనీలో జరిగిందని స్థానికులు సోమవారం ఉదయం తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వంట మాస్టర్ గణేష్ తన భార్య రేణుకతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో గణేష్ కోపంతో రోకలిబండతో రేణుక తలపై కొట్టగా ఆమె అక్కడికక్కడే మరణించింది .స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తును చేపట్టారు.