కొండపి: కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ మంత్రిని ఆదేశించిన వైవి సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లా కొండపి వైసిపి ఇన్చార్జ్ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం వైసీపీ నేత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్న అనంతరం కోటి సంతకాల కార్యక్రమం అలానే నియోజకవర్గ పరిస్థితులు తదితర అంశాలపై ఇరువురు నాయకులు మాట్లాడారు. వై వి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేసేలా చూడాలని మాజీ మంత్రికి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం పెద్ద తప్పుగా ఇరువురు నేతలు పేర్కొన్నారు.