ఆళ్లగడ్డ పట్టణంలోని టిడ్కోలో మలేరియా అధికారుల ఆధ్వర్యంలో, దోమల నివారణ చర్యలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో సోమవారం దోమల ఉత్పత్తి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీ అరుణ్ కుమార్లు స్ప్రేయింగ్ చేయించారు. ఈ సందర్భంగా శివచంద్రారెడ్డి ప్రజలకు పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మురికి కాలువలు, పరిసరాల్లో దోమల నివారణ రసాయనాలను చల్లారు.