నూతనకల్: నూతనకల్ లో యూరియా కోసం రైతుల ఆగ్రహం
నూతనకల్ మండలంలో యూరియా కొరతపై రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ వద్ద క్యూలైన్లలో నిలబడిన రైతులకు యూరియా స్టాక్ లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గత మూడు రోజులుగా స్టాక్ రాలేదని వ్యవసాయాధికారి మల్లారెడ్డి చెప్పారు.