పలమనేరు: ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి బారికేట్స్ ఏర్పాటు, ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్న ఎస్.ఐ
పలమనేరు: పట్టణ ఎస్.ఐ.లోకేష్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. పలమనేరులో నెలకొన్న ట్రాఫిక్ సమస్య అందరికీ తెలిసిందే రోడ్లు చిన్నవి వాహనాలు ఎక్కువగా ఉండటం వలన అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సమావేశంలో కూడా ట్రాఫిక్ సమస్యపై చర్చ జరిగిన విషయం విధితమే, ఈ నేపథ్యంలో రెక్కమాను సర్కిల్ వద్ద నాగార్జున సిమెంట్ వారు అందించిన బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరుకు రోడ్లలో రాకపోకలకు అంతరాయం లేకుండా వన్ వే అమలు చేస్తున్నాం, ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని పట్టణ ప్రజలను కోరారు.