శామీర్పేట: అన్నోజిగూడ బ్రిడ్జి కింద వరద నీరు వాహనాదారులకు ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ బ్రిడ్జి కింద గత కొన్ని సంవత్సరాలుగా కొద్దిపాటి వర్షానికి కూడా భారీగా వర్గ నీరు నిలిచి వాహనాదాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార యంత్రాంగం ఈ సమస్యను మళ్ళీ పునరావతం కాకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనాదారులు తెలిపారు.