మంత్రాలయం: ఏపీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఉల్లి రైతులు మరియు కూటమి నాయకులు
మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సోమవారం మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి ఉల్లి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. మాలపల్లి గ్రామంలో కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 పరిహారం ప్రకటించిన విషయాన్ని వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు.