మంత్రాలయం: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శుక్రవారం ఆయనకు శ్రీ మఠం మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవిని, అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ఆయనకు మేనేజర్ రాఘవేంద్ర స్వామి జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. ఆయన వెంట జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పన్నాగ వెంకటేష్ ఉన్నారు.