నెల్లూరులో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్, 10 మందికి గాయాలు
నెల్లూరులోని రామలింగాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం డ్యామేజ్ అయింది. బస్సులో ఉన్న సుమారు పదిమంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. వారిలో ఒక వృద్ధురాలు కి తీవ్ర గాయాలు అయ్యాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ట్రావెల్ బస్సుకి ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు