వాల్మీకుల చిరకాల కల ఎస్టీ పునరుద్ధరణ కై సహకరించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ కి వాల్మీకి మహాసేన వినతి పత్రం అందజేత
వాల్మీకులను ఎస్టీల జాబితాలోకి చేర్చాలని మదనపల్లి ఎమ్మెల్యే కి బుధవారం వాల్మీకి మహాసేన వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా వాల్మీకి మహా సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాషి హరికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకుల జనాభా 30 లక్షల మంది పైగా ఉన్నారని అందులోనూ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణంలో అత్యధికంగా 40 నుంచి 45 వేలకు మించి వాల్మీకులు ఉన్నారని అన్నారు. వాల్మీకుల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. వాల్మీకుల స్థితిగతులు తెలిసిన ఎమ్మెల్యేకి విన్నవిస్తూ దశాబ్దాల కల అయిన ఎస్టీ పునరుద్ధరణకై సహకరించాలన్నారు