అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. పరిశుద్ధ కార్మికులకు స్పందించాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని వారిని వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనను వ్యక్తం చేశారు.