ఆదోని మండలం విరుపాపురం-నగరూరు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా చెందిన దాదా పీరా అనే యువకుడు బైకుపై ఆదోని నుంచి ఇంటికి బయల్దేరాడు. రోడ్డులో గుంతను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.