తాడంకి గ్రామంలో విద్యుత్ షాక్తో నాలుగేళ్ల బాలుడు మృతి
Machilipatnam South, Krishna | Sep 17, 2025
పమిడిముక్కల మండలం తాడంకిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఉన్న రైస్ మిల్లు దగ్గర ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు యడ్లపల్లి తిరుపతయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. రైస్ మిల్లు వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. బాలుడి వద్ద కుంటుంబ సభ్యులు బోరును విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.