ఉదిరిపి కొండ గ్రామంలో పాము కాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కోడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో పాముకాటుకు గురైన గొర్రెల కాపరి వన్నూరు స్వామి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆదివారం పాముకాటుకు గురైన అతనిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్సలు అందిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.