ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డి పల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.