రాయదుర్గం: వైకాపా నేతలు జగనన్న లేఔట్ల పేరుతో రూ. 3 కోట్లు అవినీతికి పాల్పడ్డారు : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
వైకాపా నేతలు రైతుల నుంచి కారు చౌకగా భూములు సేకరించి జగనన్న లేఔట్లకు ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు విక్రయించి సొమ్ము చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలో రూ.3 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆధారాలతో సహా తాము నిరూపించామన్నారు. పేదల గృహ నిర్మాణ పథకాన్ని వైకాపా ప్రభుత్వం హయాంలో పూర్తిగా విస్మరించిందన్నారు. పేదలందరి సొంత ఇంటి కలను 2029 నాటికి నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం పట్టణంలో లభ్దిదారుడి పక్కా ఇంటిని ఆయన ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో ఈ విషయాలు చెప్పారు.