పాన్‌గల్: వనపర్తి జిల్లా ఇంటర్ పరీక్ష హాల్లో గోడ గడియారాలు ఏర్పాటు డిఐఈఓ ఎర్ర అంజయ్య
వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని కేంద్రాల్లో సోమవారం నాటికి గోడ గడియారాలు ఏర్పాటు చేయనున్నట్లు వనపర్తి డిఐఈఓ ఎర్ర అంజయ్య ఆదివారం తెలిపారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచన మేరకు గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా విద్యార్థులు చేతి గడియారాలు కూడా సెంటర్లలోకి తీసుకుపోవద్దనే నిబంధన ఉన్నది.