మెదక్: ఇందిరమ్మ ఇండ్లను సందర్శించిన జడ్పీ సీఈఓ ఎల్లయ్య
Medak, Medak | Sep 19, 2025 నిజాంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం సాయంత్రం జడ్పీ సీఈఓ ఎల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు సొంత స్థలంలో ఇండ్లలో కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలవారీగా 5 లక్షల రూపాయలను పొందాలని లబ్ధిదారులకు సూచించారు. డబ్బులు విషయంలో ఇబ్బందులు కలిగితే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి గ్రామ కార్యదర్శి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.