కుప్పం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎఫ్ ఆర్ ఓ జయశంకర్
కుప్పం మండల పరిధిలో 6 ఏనుగులు సంచరిస్తున్నాయని గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుప్పం ఎస్ఆర్ఓ జయశంకర్ తెలిపారు. కుప్పం మండలం మోట్లచేను, కూసూరు, అడవి ములకలపల్లి గ్రామాల పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని రాత్రి వేళల్లో పంట పొలాల వద్దకు రైతులు వెళ్లకూడదని హెచ్చరించారు. ఏనుగుల గురించి తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.