ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాలేజీ సర్కిల్లో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారధిలో పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అన్నదానాన్ని చేపట్టారు. అదేవిధంగా కదిరి మండలంలోని పట్నం గ్రామంలో బుధవారం రాత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.